డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, చైతన్యపురి, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాములు హెరాయిన్, 2గ్రాములు ఎండిఎంఏ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…రాజస్థాన్ రాష్ట్రం, గుడమలాని, బార్మర్‌కు చెందిన విర్మా రామ్ డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్నాడు. ఇతడికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ కళ్యాణ్ అలియాస్ దినేష్‌కుమార్ అలియాస్ రాహుల్ బాయ్ అలియాస్ దినేష్ బిష్ణోయ్, హీరా రామ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారిని రామ్ వీరి వద్ద కొనుగోలు చేసి తీసుకునేవాడు. తర్వాత వారి వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో నిఘా పెట్టిన ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, చైతన్యపురి పోలీసులు మెట్రో స్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours