సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి నివాసంలో ఇడి సోదాలు ముగిశాయి. గురు వారం తెల్లవారుజామున ఇడి అధికారులు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఇడి సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాం శమైంది. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఎంఎల్‌ఎకు అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల మేరకు సోదాలు నిర్వహించారు. అయితే గతంలో ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి నిర్వహిస్తున్న మైనింగ్‌పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.341 కోట్లు ప్రభుత్వానికి కట్టలేదు. ఈ మేరకు అక్రమ మైనింగ్ నిర్వహణపై కేసు నమోదు చేసిన అధికారులు మధుసూదన్‌రెడ్డిని రిమాండ్‌కు పంపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours