టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచకప్ సూపర్8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 21 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కంగారూలకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వార్నర్‌లు విఫలమయ్యారు. హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నవీనుల్ హక్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు వార్నర్ కూడా 3 పరుగులు మాత్రమే చేసి నబి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours