అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో వైసిపి అధినేత, మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిపితే బాగుంటుందని ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికలలో పేపర్ బ్యాలెట్‌ను వాడుతున్నాయని చెప్పారు. దీంతో మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమికి అన్ని సీట్లు రావడం గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెబుతారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి సంక్షేమ పథకాలు అందించామని, పేదరిక నిర్మూలన ధ్వేయంగా పని చేశామని, ఎపిని అని విధాలుగా అభివృద్ధి చేసిన 11 సీట్లు రావడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం ఓట్లతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, లోక్ సభ ఎన్నికలలో 40 శాతం ఓట్లతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. జగన్‌కు 40 శాతం ఓట్లు వస్తే 11 సీట్లు ఏలా వస్తాయని రోజా అడిగారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే టిడిపి, జనసేన నాయకులు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours