ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు, సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం , ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా, చైనా దళాలు దాడి చేసినట్టు వెల్లడించారు. బీజింగ్ దళాలు మొదట ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి, తరువాత బోట్ల లోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిళ్లను కాజేశారు., అక్కడే ఉన్ననేవిగేషన్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సంఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటన వేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటనపై స్పందించారు.


Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours