అమరావతి: సింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని, పంచగ్రామాల భూసమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.  ఎపి ప్రజలకు మంచి జరగాలని సింహాద్రి అప్పనన్నస్వామిని కోరుకున్నానని పేర్కొన్నారు. సింహాచలంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసు అధికారులు వైసిపి నాయకులకు తొత్తులుగా పని చేశారని మండిపడ్డారు. ఆ అధికారుల్లో వైసిపి రక్తం ప్రవహించినట్లుగా వ్యవహరించారని, జగన్‌పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసే వెళ్లోచ్చని అనిత సూచించారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎవరు తప్పుచేసినా వదలమని హెచ్చరించారు.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours