తమ ప్రభుత్వం అప్పులు చేసి సంపద సృష్టించి వాటి ద్వారా సంక్షే మ పథకాలను అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహి ళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డిలేని రుణాలు అందిస్తామని తెలిపారు. రుణమాఫీకి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఎవరికీ ఎ లాంటి అనుమానాలు అవసరం లేదని చేశారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కులగణన చేపట్టాలని, తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలని, పాలనలోనూ అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్ర ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

Share To:
Next
కొత్త పోస్ట్
Previous
This is the last post.

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours