హైదరాబాద్: ఎవరి నుంచి, ఎక్కడి నుంచి కాల్ వస్తోందో తెలిపే యాప్ ‘ట్రూకాలర్’. కానీ జులై 15 తర్వాత దానవసరం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే టెలికామ్ కంపెనీలు కాల్ చేస్తున్న వ్యక్తి పేరుతో పాటు అతని నంబర్ ను చూపించే విధంగా పనిచేస్తున్నాయి. ముంబై, హర్యానాలో టెలికామ్ కంపెనీలు వాటికి సంబంధించిన ట్రయల్స్ మొదలెట్టాయి. జులై 15లోగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.సిమ్ కొనుగోలు చేసేప్పుడు ఫారమ్ లో నింపే సమాచారం ఆధారంగా ఎవరు, ఎక్కడి నుంచి చేస్తున్నారన్నది తెలుస్తుంది. ట్రాయ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ప్రొవైడర్లు తమ కస్టమర్ అప్లికేషన్ ఫారమ్(సిఎఎఫ్)లో ఇచ్చిన పేరు గుర్తింపును ఉపయోగించాల్సి ఉంటుంది. కంపెనీలు పెద్ద ఎత్తున కొనే సిమ్ లకు ఆ కంపెనీ పేరు కనపడవచ్చు.


 

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours